అబ్బే త్రిషని అసలు అడగలేదంటుంది

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష కోలీవుడ్ లో చేసిన 96 సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి రావడమే కాదు వరుస అవకాశాలతో [more]

Update: 2019-10-24 06:32 GMT

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష కోలీవుడ్ లో చేసిన 96 సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి రావడమే కాదు వరుస అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కోలీవుడ్ లో వరుస అవకాశాలు రావడమే కాదు తాజాగా తెలుగులో చిరంజీవి తో మరోసారి త్రిష నటించబోతుంది అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కొరటాల శివ – చిరు కాంబోలో తెరకెక్కుతున్న చిరు 152వ సినిమాలో చిరు సరసన అనుష్క, నయనతార, తమన్నా పేర్లు బాగా వినబడగా… తాజాగా త్రిష ఫిక్స్ అంటూ వార్తలొచ్చాయి. ఇక ఫైనల్ గా చిరు తో త్రిష మరోసారి కన్ఫర్మ్ అంటూ మెగా ఫాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఎవరు ఎవరిని వద్దనుకున్నారు…..

కానీ త్రిష మాత్రం తాను చిరంజీవి సినిమాలో నటించడం లేదంటూ చెబుతుంది. నేను చిరంజీవిగారి సినిమాలో న‌టిస్తున్నాన‌న్న వార్త‌ల్లో నిజం లేదు. కొరటాల శివ సినిమాలో నేను లేను. చిరు తో అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తా అంటూ చెన్నై లో మీడియాతో చెప్పిన మాట. కానీ మరోపక్క త్రిషని కొరటాల శివ టీం మెంబెర్ ఒకరు కలవడం, చిరు తో సినిమాపై త్రిష తో సంప్రదింఫులు కూడా జరిపారనే న్యూస్ ఉంది. మరి కొరటాల శివే త్రిషని కాదనుకున్నాడా? లేదంటే త్రిషే చిరు సినిమా వద్దనుకుందా? అనేది తెలియదు కానీ.. త్రిష చెబుతున్న దానిలో నిజం మాత్రం లేదంటున్నారు.

 

Tags:    

Similar News