RRR రీ షూట్స్ నిజామా?

స్టార్ హీరో అయిన ప్రభాస్ ని హీరోగా పెట్టి తెరకెక్కించిన బాహుబలి విషయంలో రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అందుకే ముందే విడుదల డేట్ ఇచ్చినా… సమయానికి [more]

Update: 2019-10-30 07:06 GMT

స్టార్ హీరో అయిన ప్రభాస్ ని హీరోగా పెట్టి తెరకెక్కించిన బాహుబలి విషయంలో రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అందుకే ముందే విడుదల డేట్ ఇచ్చినా… సమయానికి సినిమా షూటింగ్ కంప్లీట్ కాక చెక్కి చెక్కి ఐదేళ్లకు పర్ఫెక్ట్ గా పూర్తి చేసి ప్రేక్షకుల చేత విజిల్స్, చప్పట్లు కొట్టించుకున్నాడు. అలాంటి దర్శకుడు నుంచి RRR సినిమా ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కుతుంది అంటే… ఆ సినిమాని రాజమౌళి ఎంతెలా చెక్కుతాడో తెలియంది కాదు. సినిమా మొదలయ్యింది మొదలు ఓసారి రాజమౌళి కొడుకు వివాహం సందర్భంగా షూటింగ్ కి బ్రేక్ పడితే తర్వాత చరణ్, ఎన్టీఆర్ ల గాయాలతో సినిమాకి బ్రేకులు పడ్డాయి. తర్వాత మళ్ళీ బాహుబలి టీం లండన్ రీ యూనియన్ అవ్వడంతో కాస్త బ్రేకిచ్చిన RRR షెడ్యూల్ తిరిగి మొదలైంది. ఈ లోపు మీడియాలో RRR అసలు అనుకున్న టైం అంటే 2020 జులై 30 వస్తుందా అనే డౌట్ ప్రచారంలోకొచ్చింది.

షాకైన రాజమౌళి…

తాజాగా రాజమౌళి ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్స్ రషెస్ చూసి కాస్త షాకైనట్లుగా ఫిలింసర్కిల్స్ లో ఓన్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు తెరకెక్కించిన మేకింగ్ షాట్స్ సరిగా రాకపోవడంతో.. ఇప్పుడు కొన్ని సీన్స్‌ను మళ్ళీ రీ షూట్ చేయాలని రాజమౌళి ఆలోచనట. ఈ విషయమై రాజమౌళి ఎన్టీఆర్ – చరణ్ లతో చర్చిస్తాడని అనుకుంటున్నారు. కాబట్టి RRR లోని కొన్ని సీన్స్ ఖచ్చితంగా రీ షూట్స్ చేస్తారని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి తనకు కావాల్సిన అవుట్ పుట్ వచ్చే వరకు నిద్ర పోయే రకం కాదు కాబట్టి.

 

Tags:    

Similar News