96 రీమేక్ టైటిల్ భలే ఉంది..!

దిల్ రాజు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న 96 రీమేక్ తెలుగులో మొదలు కావడానికి సర్వం సిద్ధమవుతున్నది. 96 తమిళ మూవీలో విజయ్ సేతుపతి, త్రిష లీడ్ రోల్స్ [more]

Update: 2019-03-04 08:46 GMT

దిల్ రాజు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న 96 రీమేక్ తెలుగులో మొదలు కావడానికి సర్వం సిద్ధమవుతున్నది. 96 తమిళ మూవీలో విజయ్ సేతుపతి, త్రిష లీడ్ రోల్స్ లో నటిస్తే.. తెలుగులో శర్వానంద్ – సమంత నటిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ఇష్టంగా రీమేక్ కి ఏర్పాట్లు చేస్తున్నాడు. నిన్నమొన్నటి వరకు ఈ 96 సినిమా విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అలాంటిదేం లేదు సినిమా త్వరలోనే మొదలవుతుందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేసాడు. ఇక 96 సినిమాని యాజిటీజ్ గా తెలుగులో రీమేక్ చెయ్యకుండా తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేయించాడట దిల్ రాజు. ఇక కథకు తగ్గట్టుగా ఆ సినిమా టైటిల్ కూడా తెలుగులో ఉండేలా చూస్తున్నాడు.

టైటిల్ మారుస్తున్న దిల్ రాజు

సమంత – శర్వానంద్ కలిసి నటించబోతున్న 96 రీమేక్ కి టైటిల్ గా దిల్ రాజు ‘జాను’ అనే టైటిల్ తో పాటు జాను అలియాస్ జానకి అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే జాను కానీ జాను అలియాస్ జానకి కానీ దిల్ రాజు ఫైనల్ చేసి.. ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయిస్తాడని సమాచారం. అయితే జాను అనే టైటిల్ కన్నా ఎక్కువగా జాను అలియాస్ జానకి టైటిల్ మీదే దిల్ రాజు గురి ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి సమంత రోల్ హైలెట్ చేస్తూ శర్వానంద్ పాత్ర కూడా ఏం తక్కువ కాకుండా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లనుంది. ఇక దిల్ రాజు ఈ 96 రీమేక్ టైటిల్ విషయాన్ని శర్వా బర్త్ డే మార్చి 6న రివీల్ చేసే అవకాశమున్నట్లుగా ఫిలింనగర్ టాక్.

Tags:    

Similar News