దిల్ రాజు ప్లాన్ ఇదేనా?

ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే అంత బాగా సినిమాలు ఆడుతాయి అని నమ్మే దిల్ రాజు తన బ్యానర్ లో రూపొందుతున్న తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం [more]

Update: 2019-10-26 10:52 GMT

ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే అంత బాగా సినిమాలు ఆడుతాయి అని నమ్మే దిల్ రాజు తన బ్యానర్ లో రూపొందుతున్న తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం 96 రీమేక్ విషయంలో ప్రమోషన్ కాదు కదా ప్రెస్ నోట్ కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. శర్వానంద్‌-సమంత కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈసినిమా రీమేక్ రైట్స్ కోసం చాలామంది ట్రై చేసినా చివరికి దిల్ రాజు చేతికే వచ్చింది.

క్లారిటీ వస్తేనే…

కొన్ని రోజుల కిందట ఈ సినిమా ను డిసెంబర్ 20 లేదా 25న రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకున్నారు. ఇది అధికారంగా అనౌన్స్ చేయకపోయినా చాలా వరకు ఇది నిజమే అని నమ్మారు. అదే సమయంలో చాలా చిత్రాలు రిలీజ్‌ అవుతూ వుండడంతో 96 రిలీజ్‌పై కంగారు పడడంలేదు దిల్ రాజు. రీసెంట్ గా సామ్ పోర్షన్ కూడా కంప్లీట్ అయిపొయింది. మరి డిసెంబర్ లో కాకపోతే ఈ సినిమాను వచ్చే ఏడాది ఫ్రిబ్రవరిలో చేయాలనీ చూస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు ఉండడంతో ఈ మూవీని ఫ్రిబ్రవరి లో రిలీజ్ చేయాలనీ ప్లాన్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

 

 

Tags:    

Similar News