తెలుగులోకి 96 రీమేక్

శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దిల్ రాజు నిర్మాణంలో కొత్త చిత్రం ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో లాంఛనంగా [more]

Update: 2019-04-06 12:14 GMT

శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దిల్ రాజు నిర్మాణంలో కొత్త చిత్రం ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. సి.ప్రేమ్ కుమార్ దర్శకుడు. తమిళంలో విజయవంతమైన '96' చిత్రానికి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కనుంది.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ – “ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాం. తమిళంలో విజయవంతమైన '96' చిత్రాన్ని తెలుగులో రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. తమిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నెల ద్వితీయార్థంలో చిత్రీకరణను ప్రారంభిస్తాం. ముందు 15 రోజుల పాటు కెన్యాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. తర్వాత హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో జూలై అంతా చిత్రీకరణను పూర్తి చేస్తాం“ అన్నారు.

Tags:    

Similar News