75 కోసం జోరు పెంచిన సీనియర్ హీరో

Update: 2016-12-23 08:01 GMT

నిర్మాతల హీరోగా పేరు పొందిన విక్టరీ వెంకటేష్ తన నట జీవితం ప్రారంభం ఐన నాటి నుంచి నేటి వరకు విజయాపజయాలకు అతీతంగా సినిమాలు చేస్తూ వున్నారు. ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం సినిమాలు చేయటం కానీ, కేవలం అభిమానులను తృప్తి పరచటానికి నిర్మాతకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు కానీ వెంకటేష్ ఎప్పుడు చేయలేదు. అందుకే తన తోటి సమకాలీన కథానాయకులు తనకన్నా ఎక్కువ సంఖ్యలో చిత్రాలు చేసి, వసూళ్ల పరంగాను తనకన్నా ముందు ఉన్నప్పటికీ వెంకీ తనకి తగ్గ కథ అనుకునవ్వి ఒక వర్గ ప్రేక్షకులకే పరిమితమయ్యే కథైనా చేస్తుంటారు. ప్రతి ఏటా తన శైలి సినిమాలతో వినోదాన్ని పంచే వెంకీ తన తండ్రి దగ్గుబాటి రామ నాయుడు మరణానంతరం సినిమాల నుంచి కొంత విరామం తీసుకుని బాబు బంగారం చిత్రం చేసారు.

గోపాల గోపాల తరువాత చేసిన బాబు బంగారం సినిమా వెంకీ కెరీర్ లో మరో అబొవె యావరేజ్ సినిమాగానే మిగిలింది. కానీ ఆ చిత్రం ఐన వెంటనే సాలా ఖదూస్ రీమేక్ గా తెరకెక్కుతున్న గురు చిత్రాన్ని పూర్తి చేసి గణతంత్ర దినోత్సవానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఆ చిత్రం తరువాత జనవరి నుంచి కిశోరె తిరుమల(నేను శైలజ ఫేమ్)దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్ర రెగ్యులర్ షూట్లో పాల్గొని 2017 వేసవికి ఆ చిత్రం విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. వెంకీ కెరీర్ లో కిశోరె తిరుమల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 74 వ చిత్రం. అయితే రానున్న సంక్రాంతి పండుగకు తన 75 వ చిత్ర ప్రకటన చేయబోతున్నాడట వెంకీ. ప్రస్తుతం 75 వ చిత్రానికి గాను క్రిష్ మరియు పూరి జగన్నాథ్ లతో కథ చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీరిలో ఒకరికి తన 75 వ చిత్ర దర్శకత్వ బాధ్యతలు వెంకీ అప్పగించనున్నాడని సమాచారం.

Similar News