'7' వెనుక రహస్యం..!

Update: 2018-10-16 06:59 GMT

తరుణ్ హీరోగా ‘ఒక ఊరిలో’ సినిమాతో పరిచయం అయినా రమేష్ వర్మ అనే దర్శకుడు ఆ తర్వాత 'రైడ్', 'వీర', 'అమ్మాయితో అబ్బాయి' లాంటి సినిమాలు తీసాడు. అయితే కొంతకాలం విరామం తర్వాత మళ్లీ మన ముందుకు ఇంకో సినిమాతో వస్తున్నాడు అయితే ఈసారి దర్శకుడిగా కాదు నిర్మాతగా వస్తున్నాడు. మారుతీ దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’ లాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన నిజార్ షఫి మెగాఫోన్ పెట్టనున్నాడు. '7' అనే థ్రిల్లర్ జోనర్ తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 7 అనేది ఏడుగురు అమ్మాయిల కథను సూచించే టైటిల్. రోజురోజుకి ఒక్కో హీరోయిన్స్ పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, నందిత శ్వేతల పోస్టర్లు రిలీజ్ చేశారు.

ఈ సినిమాతోనైనా సక్సెస్ అవుతాడా..?

ఇక రీసెంట్ గా పూజిత పొన్నాడ పోస్టర్ వదిలారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ చాలా ఇంటెన్స్‌ గా ఉన్నాయి. రమేష్ వర్మ డైరెక్టర్ అవ్వకముందు పోస్టర్ డిజైనర్. అందుకే అతని సినిమాల పోస్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ తీర్చిదిద్దుతుంటాడు. కానీ అతని సినిమాలే అంతగా కనెక్ట్ అవ్వవు. అతనికి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు. ఒక్క రైడ్ సినిమా పర్లేదు అనిపించుకుంది అంతే. మరి ఈ సినిమాతో రమేష్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

Similar News