6 న విజయ్ ఆంటోని 'బేతాళుడు' ఆడియో  

Update: 2016-10-31 14:28 GMT

విజయ్ ఆంటోని' కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న 'సైతాన్' చిత్రం తెలుగు ప్రేక్షకులను 'బేతాళుడు' గా త్వరలో పలకరించబోతోంది.

'బేతాళుడు' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 6 న 'బేతాళుడు' ఆడియో చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది. తెలుగు,తమిళంలో చిత్రం నవంబర్ 18న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు నిర్మాత ఎస్.వేణుగోపాల్. 'మానస్ రిషి ఎంటర్ ప్రైజస్' సంస్థ తో కలసి ఈ 'బేతాళుడు' చిత్రాన్నితెలుగునాట తమ 'విన్.విన్.విన్. క్రియేషన్స్' సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు.

'బేతాళుడు' : 'సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్'

చిత్ర కథానాయకుడు 'విజయ్ ఆంటోని' మాట్లాడుతూ..' నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యం గా ఉన్న నాకు కొనసాగింపు ఈ 'సైతాన్'. 'సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్' ఈ చిత్రం. తెలుగునాట 'బేతాళుడు' పేరుతొ విడుదల అవుతోంది చిత్రం.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతో పాటు, వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది. నా సరసన 'అరుంధతి నాయర్' నాయికగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు 'ప్రదీప్ కుమార్' ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చిదిద్దుతున్నారని నమ్ముతున్నాను. 'ప్రదీప్ కలపురయల్' సినిమాటోగ్రఫీ ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి. 'సైతాన్' కు సంగీతం నేనే. పాటలు,నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. 'బిచ్చగాడు' విజయం తరువాత విడుదల అవుతున్న 'సైతాన్' చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు చిత్ర కథానాయకుడు 'విజయ్ ఆంటోని'. తెలుగునాట నటునిగా తనకు ఈ చిత్రం మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందని ఆశిస్తున్నాను అన్నారు

'విజయ్ ఆంటోని,,అరుంధతినాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: ప్రదీప్ కలిపురయత్,ఎడిటర్; వీర సెంథిల్, ఫైట్స్: శరవణన్, ఆర్ట్: శక్తి వెంకట్ రాజ్.

నిర్మాతలు: కె.రోహిత్,ఎస్.వేణుగోపాల్

సమర్పణ: ఎం.శివకుమార్

దర్శకత్వం: ప్రదీప్ కుమార్

బ్యానర్: మానస్ రిషి ఎంటర్ ప్రైజస్, విన్.విన్.విన్. క్రియేషన్స్

Similar News