40 ముద్దులున్నా ‘కత్తెర’ పడలేదు!

Update: 2016-11-17 13:37 GMT

మన చిత్రాలకు సెన్సార్ ఆంక్షలు అధికంగా వున్నాయి అని ఎందరో సినీ ప్రముఖులు ఎన్నో వేదికలపై వెల్లడించారు. ఫిలిం మేకర్స్ క్రియాశీలకమైన ఆలోచనలకు ఈ ఆంక్షలు అడ్డుకట్టగా నిలుస్తున్నాయని వాపోయినవారు కూడా వున్నారు. ఇటవల ఉడ్తా పంజాబ్ చిత్ర విషయంలో అయితే సెన్సార్ బోర్డు కి చిత్ర బృందానికి మధ్య నడిచిన వివాదం విస్తరించి సెన్సార్ బోర్డు కి బాలీవుడ్ కి మధ్య యుద్ధం లా తయారు ఐయి న్యాయస్థానం చొరవతో సర్దుమణిగిన సంగతి విదితమే. ఇతర దేశాల చిత్రాలలోలా ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్స్ వున్న చిత్రాలకు సెన్సార్ కొన్ని కోతలు సూచించి అడల్ట్ రేటింగుతో చిత్ర విడుదలకు అనుమతి ఇచ్చేది.

గత కొంత కాలంగా వినూత్న ప్రచారంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న బాలీవుడ్ చిత్రం బేఫికర్. ఆదిత్య చోప్రా సారధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఏకంగా 40 ముద్దు సన్నివేశాలు ఉండటం విశేషం. అదనంగా ఇంటిమేట్ సీన్స్ మరియు అర్ధ నగ్న ప్రదర్శన సన్నివేశాలు చాలానే వున్నాయి. డిసెంబర్ 9 న విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సెన్సార్ కార్యక్రమాల కోసం పంపగా ఒక్క కట్ కూడా సూచించకుండా, యూ/ఏ రేటింగ్ తో చిత్ర విడుదలకు అనుమతి ఇచ్చింది సెన్సార్ బోర్డు. సెన్సార్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం అటు చిత్ర బృందంతో సహా మొత్తం పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది.

రణవీర్ సింగ్, వాని కపూర్ జంటగా నటించిన బేఫికర్ చిత్రంలో వీరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా వుండబోతుందో అనే ఊహాగానాలు ఇప్పటికే తార స్థాయికి చేరుకున్నాయి. చిత్ర బృందం విడుదల చేసిన వివిధ పోస్టర్లు ఇందుకు కారణం.

Similar News