రోజుకి 32 గుడ్లు – కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ అంటే ఇష్టపడని వారుండరు. సినిమాలను లైట్ తీస్కొని రాజకీయాల్లో నెగ్గలేక మల్లి సినిమాలు చేస్తున్న కమల్ హాసన్ తాజాగా చిత్రం భారతీయుడు 2 [more]

Update: 2020-05-04 05:11 GMT

లోకనాయకుడు కమల్ హాసన్ అంటే ఇష్టపడని వారుండరు. సినిమాలను లైట్ తీస్కొని రాజకీయాల్లో నెగ్గలేక మల్లి సినిమాలు చేస్తున్న కమల్ హాసన్ తాజాగా చిత్రం భారతీయుడు 2 సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో చెప్పలేకపోతున్నారు. కారణం కరోనా లాక్ డౌన్ ఒక కారణమైతే.. రెండోది.. లైకా ప్రొడక్షన్ తో కమల్ కున్న విభేదాలు. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ లో హీరో విజయ్ సేతుపతి తో ఇన్స్టాలో మాట్లాడిన కమల్ హాసన్ తాను తినే తిండి ఎలా ఉంటుందో.. తనకి ఎగ్స్ అంటే ఎంత చిరాకో చెప్పాడు.

ఒక సినిమా కోసం తాను చాలా సన్నగా కనబడడానికి గాను.. రోజుకి 32 గుడ్లు తినడం, అలాగే ఎక్కువగా చికెన్ తినడం చేసానని.. నా తిండి చూసి నటుడు శివాజీ విస్మయానికి లోనయ్యారని, ఇక రోజుకి 32 గుడ్లు తినేసరికి.. ఆ సినిమా ముగిసాక మళ్ళీ గుడ్లంటే విరక్తి పుట్టిందని.. అలా తిన్న తర్వాత ఒక ఏడాది పటు మళ్ళీ గుడ్డు ముట్టుకోలేదని చెబుతున్నాడు. ఒకప్పుడు 14 కిలోమీటర్లు పరిగెత్తేవాడినని..కానీ తనకి ప్రమాదం జరిగాక అంత దూరం పరిగెత్తలేకపోతున్నట్లుగా విజయ్ తో ముచ్చటించాడు కమల్ హాసన్.

Tags:    

Similar News