’24 కిస్సెస్’ టీజర్ కు మంచి స్పందన

Update: 2018-07-11 09:45 GMT

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన '24 కిస్సెస్' సినిమా ఫస్ట్ లుక్ కు , హీరోయిన్ ఇలియానా విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. 'మిణుగురులు' చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'మిణుగురులు' చిత్రం విమర్శకుల ప్రసంశలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది.

సినిమా బాగుంటే ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. 24 కిస్సెస్ సినిమా అదే కోవలోకి చేరబోతోంది. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా యువతను అలరించే అవకాశం ఉంది. సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ '24 కిస్సెస్' సినిమాను నిర్మించాయి.

నటీనటులు:

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరేష్

Similar News