20 – 20 అంటున్న పవన్?

ప్రస్తుతం దుబాయ్ లో ఇండియా ఐపీఎల్ మ్యాచ్ లు 20 – 20 అంటూ యమా రంజుగా సాగుతున్నాయి. సాయంత్రం అయితే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు క్రికెట్ [more]

Update: 2020-10-06 06:51 GMT

ప్రస్తుతం దుబాయ్ లో ఇండియా ఐపీఎల్ మ్యాచ్ లు 20 – 20 అంటూ యమా రంజుగా సాగుతున్నాయి. సాయంత్రం అయితే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు క్రికెట్ అభిమానులు. ఎలాగూ స్టేడియం కి వెళ్లి క్రికెట్ చూడడానికి కరోనా అడ్డం పడడంతో అందరూ 20 – -20 ఐపీఎల్ మ్యాచ్ లను టివీల్లోనే వీక్షించేస్తున్నారు. అయితే టాలీవుడ్ టాప్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 20 – 20 అంటున్నాడట. అంటే నేను చెయ్యాల్సిన వకీల్ సాబ్ షూటింగ్ కి కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇస్తా అని చెబుతున్నాడట. ఆ 20 రోజుల్లో మీరు కిందా మీదా పడండి.. నేను మాత్రం కేవలం 20 రోజులే డేట్స్ అడ్జెస్ట్ చేస్తా అని వేణు శ్రీరామ్ దగ్గరనుండి దిల్ రాజుకి చెప్పేశాడట. 

ప్రస్తుతం దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ షూటింగ్ మొదలు పెట్టేసాడు. పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ని తెరకెక్కిస్తూ పవన్ షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడో అని ఎదురు చూస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఈ నెల 26 నుండి వకీల్ సాబ్ షూట్ కి జాయిన్ అవుతానని చెప్పినట్లుగా తెలుస్తుంది. పవన్ ఇచ్చిన 20 రోజుల కాల్షీట్స్ లో వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చెయ్యాల్సి ఉంది. మరి పవన్ ఇచ్చిన 20 రోజులు వేణు శ్రీరామ్ నాన్ స్టాప్ షూటింగ్ చెయ్యాల్సి ఉంటుంది. లేదంటే పవన్ మళ్ళీ దొరకడు. ఇక షూటింగ్ నవంబర్ కల్లా పూర్తి చేసి డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని వచ్చే సంక్రాంతికి వకీల్ సాబ్ సినిమాని విడుదల చేసే ప్లాన్ లో నిర్మాత దిల్ రాజు ఉన్నాడు. పాపం కరోనా కారణంగా ఆరు నెలలు అనుకున్న వకీల్ సాబ్ కాస్త ఏడాది కి కానీ పూర్తి కాలేదు.

Tags:    

Similar News