2 మిలియన్ దాటిన కింగ్ నాగార్జున

Update: 2017-01-06 05:00 GMT

సినిమా రంగానికి చెందిన ప్రముఖులందరూ వారి అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవటానికి ట్విట్టర్ వేదికగా నిలుస్తుంది. అందుకే సినిమా తారలందరూ ట్విట్టర్ ని వినియోగిస్తున్నారు. టాప్ స్టార్స్ కూడా ట్విట్టర్ వినియోగిస్తుండటంతో సినిమాల కలెక్షన్స్ విషయంలో ఎంత పోటీ ఉంటుందో సుమారు అదే స్థాయిలో సెలబ్రిటీస్ కి ఫాలోయర్స్ సంఖ్య పైన కూడా పోటీ నెలకొంటుండటం విశేషం. సినిమా క్రేజ్ అండ్ మార్కెట్ అంచనాలు కూడా ఆన్లైన్ రికార్డ్స్ ద్వారా నిర్ధానకు రావటం కూడా మనం చూస్తూనే వున్నాం. యూట్యూబ్ లో అప్లోడ్ ఐన ప్రచార చిత్రాలకు గంట సేపటికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఒక రోజు వ్యవధిలో ఎన్ని వ్యూస్ వచ్చాయి అంటూ అభిమానులు వేసుకులే లెక్కలు, తదుపరి రానున్న ఇతర హీరో ఆ రికార్డ్స్ ని బీట్ చేయటానికి జరిగే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

ఇక ట్విట్టర్ లో దక్షిణాది కళాకారులు కూడా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీస్ వలెనే బాగా యాక్టీవ్ గా వుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కొంత కాలంగా ట్విట్టర్ ఖాతా వాడుతుండగా తాజాగా ఆయన ట్విట్టర్లో ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య 20 లక్షలకు చేరింది. ఇలా టూ మిలియన్ ఫాలోయర్స్ ని సాధించిన తెలుగు సినిమా సెలబ్రిటీస్ జాబితాలో ఇప్పటికే దర్శకులు రామ్ గోపాల్ వర్మ, ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారు చోటు సంపాదించుకోగా తాజాగా కింగ్ నాగార్జున ఈ జాబితాలోకి చేరిపోయారు.

Similar News