2.O వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..!

Update: 2018-12-03 06:56 GMT

విడుదలైన రోజు కాస్త వీక్ గా ఉన్నా రజినీ - శంకర్ ల 2.ఓ నిన్న బాగా పుంజుకుంది. 2.ఓ సినిమాలో కథ లేకపోవడం, ఆ సినిమాలోని చాలా విషయాలు సాధారణ ప్రేక్షకుడికి అర్ధం కాకపోవడంతో.. చాలామంది ప్రేక్షకులు 2.ఓ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. అలాగే ఇలాంటి క్లాసీ సినిమాకి బీ,సీ సెంటర్స్ లోనూ ఆదరణ తక్కువగానే ఉంటుంది. ఇక 2డీలో ఈ సినిమా చూసినా పిచ్చిగా ఉందంటున్నారు ప్రేక్షకులు. అందుకే 2డీ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ తక్కువగా నమోదు అవుతుండగా... 3డీ థియేటర్స్ మాత్రం కళకళలాడుతున్నాయి. ఇక ఆదివారం మాత్రం 2.ఓ బుకింగ్స్ బాగున్నాయి. అందుకే ఆదివారం రోజున 2.ఓ బాగా పుంజుకుంది. ఇక కలెక్షన్స్ కూడా కాస్త కళకళలాడాయి. మరి 2.ఓ ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఎన్ని కలెక్షన్స్ కొల్లగొట్టిందో మీరే చూడండి.

ఏరియా షేర్స్(కోట్లలో)

నైజాం 13.71

సీడెడ్ 4.95

అర్బన్ ఏరియాస్ 4.27

గుంటూరు 2.58

ఈస్ట్ గోదావరి 2.46

వెస్ట్ గోదావరి 1.71

కృష్ణ 2.00

నెల్లూరు 1.37

ఏపీ, టీఎస్ షేర్స్ 33.05 కోట్లు

Similar News