లేట్ గా వచ్చినా... యూట్యూబ్ ని షేక్ చేస్తుంది..!

Update: 2018-09-14 06:09 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. రజనీకాంత్ - అమీ జాక్సన్ హీరోహీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం '2.ఓ' . ఇందులో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ విలక్ష నటుడు అక్షయ్ కుమార్ నటించాడు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అనుకున్న సమయంలో ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా నిన్న ఆ సినిమా టీజర్ ను విడుదల చేశారు. దీంతో ఆ టీజర్ యూట్యూబ్ లో సునామీ సృష్టిస్తోంది. విడుదల అయిన 9 గంటల వ్యవధిలో 1.40 కోట్లకు పైగా వ్యూస్ సాధించగా.. 20 గంటల్లో 3 కోట్ల వ్యూస్ ను దాటి రికార్డును సృష్టించింది. తెలుగు టీజర్ వ్యూస్ 50 లక్షలను దాటాయి. టీజర్ స్టార్టింగ్ ఫ్రేమ్ నుండి ఎండింగ్ ఫ్రేమ్ వరకు అంతా విజువల్ ఎఫెక్ట్స్ అవ్వడంతో చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి.

వెయ్యి కోట్ల బడ్జెట్ తో...

గ్రాండ్ విజువల్ గ్రాఫిక్స్ కోసమే రూ. 540 కోట్లు ఖర్చు కాగా, మొత్తం బడ్జెట్ రూ. 1000 అని తెలుస్తుంది. టీజర్ తో అందరి మైండ్ పోగొట్టిన శంకర్ సినిమాతో ఇంకేం చేస్తాడో అని ఇప్పుటినుండే వెయిట్ చేస్తున్నారు. 3డీ టీజర్ ను ఇండియా మొత్తంగా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో వేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.

Similar News