2.ఓ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?

Update: 2018-12-01 07:03 GMT

గురువారం విడుదలైన 2.ఓ మూవీ ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అద్భుతమైన విజువల్ గ్రాఫిక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కథ లేకపోవడం, స్క్రీన్ ప్లేలో ఉన్న లోపాలతో అనుకున్నంత హిట్ అయితే 2.ఓ అవ్వలేదు. దర్శకుడు శంకర్ గ్రాఫిక్స్ కోసం ఏడాది టైం తీసుకున్నప్పటికీ.. ఆ క్వాలిటీ గ్రాఫిక్స్ లో ఎక్కడా కనబడలేదని.. 2.ఓ 2డీ లో చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. మరి అందరికీ 3 డి అందుబాటులో ఉండదు కాబట్టే ఈ సినిమాకి ఇలాంటి టాక్ వచ్చింది. గురువారం విడుదలైన 2.ఓ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

ఏరియా షేర్స్ (కోట్లు )

నైజాం 7.41

సీడెడ్ 2.81

నెల్లూరు 0.96

కృష్ణ 1.10

గుంటూరు 1.49

వైజాగ్ 2.45

ఈస్ట్ గోదావరి 1.50

వెస్ట్ గోదావరి 1.08

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 18.80

Similar News