అదరగొడుతున్న 2.O కలెక్షన్స్..!

Update: 2018-11-30 07:11 GMT

శంకర్ విజువల్ వండర్ 2.0 నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. 2015 లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్నా గ్రాఫిక్స్ వర్క్ హెవీగా ఉండడంతో పలుమార్లు వాయిదా పడి నిన్న రిలీజ్ అయింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడం.. క్రిటిక్స్ సైతం ఈ సినిమాను మెచ్చుకోడం ఈ మూవీకి ఇంకా ప్లస్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 80 కోట్లకు కొన్నారు. రజినీకాంత్, అక్షయ్ కుమార్ పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో తెలుగులో ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 12.66 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక ఏరియావైజ్ వివరాలు మీ కోసం...

ఏరియా షేర్స్ (కోట్లు)

నిజాం 4.73

సీడెడ్ 2.03

నెల్లూరు 0.74

కృష్ణ 0.71

గుంటూరు 1.03

వైజాగ్ 1.65

ఈస్ట్ గోదావరి 1.02

వెస్ట్ గోదావరి 0.75

టోటల్ (AP & TS) 12.66

Similar News