అక్కడే కాదు... ఇక్కడా అదే జోరు

Update: 2018-12-10 07:10 GMT

రజనీకాంత్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ సినిమా నవంబర్ 29న విడుదలైంది. మొదటి షోకే ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ రివ్యూ రైటర్స్ మాత్రం 2.ఓ ని బాగా లేపారు. శంకర్ వీఎఫెక్స్ కి పడిపోయారు క్రిటిక్స్. అయినా 2.ఓ లో కథ లేకపోవడం మైనస్. అయితే రజనీకాంత్ కన్నా ఎక్కువగా ఈ సినిమాలో విలన్ రోల్ పోషించిన అక్షయ్ కి ఎక్కువ ఆధరణ దక్కింది. అక్షయ్ మేకప్, అక్షయ్ కష్టం స్క్రీన్ మీద అడుగడుగునా కనబడింది. ఇకపోతే 2.ఓ సినిమా నెగెటివ్ టాక్ వలన బయ్యర్లు నష్టపోతారని... భారీ లాస్ అవుతారని... టాక్ మాములుగా స్ప్రెడ్ అవలేదు.

తెలంగాణలో రికార్డు...

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే ఎవ్వరైనా అదే మాట అంటారు. కాకపోతే 2.ఓ బాలీవుడ్ లో మాత్రం అక్షయ్ కుమార్ క్రేజ్ కారణంగా మొదటి పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి చేరుకొని రికార్డు సృష్టించింది. ఇక తాజాగా తెలంగాణలోనూ 2.ఓ హావా కొనసాగుతుంది. మొదటి రోజు నుండి నైజంలో 2.ఓ కలెక్షన్స్ బాగున్నాయి. ఇప్పటికీ 2.ఓ అదే హావా కొనసాగిస్తోంది. గత శుక్రవారం విడుదలైన సినిమాలలో పస లేకపోవడం ఒక కారణం అయితే... తెలంగాణలో వరసగా సెలవులు రావడం మరో కారణం. కేవలం 10 రోజుల్లోనే తెలంగాణలో 2.ఓ 20 కోట్ల మార్కు దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది.

హిందీలోనూ అదే జోరు...

మరో రెండు రోజులు ఇదే వసూళ్ల పర్వం కొనసాగితే తెలంగాణలో 2.ఓ బ్రేక్ ఈవెన్ రావడం ఖాయంగానే కనబడుతుంది. మరి నెగెటివ్ టాక్ తో ఇలా రెండు కోట్ల 2.ఓ కలెక్షన్స్ రావడం చూస్తుంటే... 2.ఓ గ్రాఫిక్స్ కి ప్రేక్షకులు ఎంతెలా కనెక్ట్ అయ్యారో అర్ధమవుతుంది. ఇక 2.ఓ కి మిగతా ఏరియాల్లో, మిగతా భాషల్లో నష్టాలు తప్పేలా లేదు. ఇక హిందీలో కూడా 2.ఓ రెండో వారంలో కూడా స్టెడీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. గత శుక్రవారం విడుదలైన సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ల కేదార్‌నాథ్‌ కి అక్కడ నెగెటివ్ టాక్ రావడం 2.ఓ కి కలిసొచ్చింది.

Similar News