‘2.0’ బయర్స్ కు టెన్షన్ పట్టుకుంది..!

Update: 2018-12-07 11:54 GMT

ఒక్కప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే రెండు వారాలకి అటు.. రెండు వారాలకి ఇటు సినిమాలను రిలీజ్ చేయాలంటే భయపడేవారు. కానీ రీసెంట్ గా రిలీజ్ ‘2.ఓ’ విషయంలో ఆ పరిస్థితులు ఏమి కనిపించడం లేదు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ వారం నాలుగు చిన్న సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. తమిళంలో కూడా మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ఏమి భయపడటం లేదు కానీ ‘2.ఓ’ బయ్యర్లే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ‘2.ఓ’ కు పాజిటివ్ వచ్చి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ ఈ చిత్రం ఒక వారం ఆడేస్తే సేఫ్ అయ్యే సినిమా కాదు. కనీసం రెండు మూడు వారాలైనా ఆడాలి. ప్రస్తుతం ఈ సినిమా అటు తమిళంలో, ఇటు తెలుగులోనూ బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఉంది. ఇప్పటివరకు 50-60 శాతం మాత్రమే పెట్టుబడి రివకరీ అయింది. ఇంకా చాలా అవ్వాల్సి ఉంది.

టెన్షన్ పడుతున్న 2.ఓ బయ్యర్స్

కలెక్షన్స్ డల్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ మూవీని 3డీ స్క్రీన్స్ లో రిలీజ్ చేయడమే. తెలుగు, తమిళ లో 3డీ థియేటర్స్ చాలా తక్కువ. ఇప్పుడు మరో సమస్య ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు. చిన్న స్థాయి సినిమాలే అయినప్పటికీ.. వాటికి పాజిటివ్ టాక్ వస్తే ‘2.ఓ’ కలెక్షన్లపై ప్రభావం పడుతుందేమోనని భయపడుతున్నారు. పైగా ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటే ‘2.ఓ’ కి స్క్రీన్స్ తగ్గిపోతాయి. తెలుగులో ఈ వారం ‘కవచం’, ‘సుబ్రహ్మణ్యపురం’, ‘నెక్స్ట్ ఏంటి’, ‘శుభలేఖ+లు’ సినిమాలొస్తున్నాయి. వీటికి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ‘2.ఓ’ వసూళ్లపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. దాంతో ‘2.ఓ’ బయర్స్ కు టెన్షన్ స్టార్ట్ అయింది.

Similar News