'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన '2.ఓ'..!

Update: 2018-12-05 08:25 GMT

రజినీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో వచ్చిన విజువల్ వండర్ '2.ఓ' గత నెల 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలయిన అన్ని చోట్ల మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. తెలుగు, తమిళం కన్న హిందీలో ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు అక్కడి జనాలు. హిందీలో ఈ సినిమా 'బాహుబలి' రికార్డ్స్ ను బ్రేక్ చేసింది.

451 కోట్ల షేర్ రాబట్టి...

హిందీ వెర్షన్ 'బాహుబలి' మొదటి పార్ట్ ఫుల్ రన్ షేర్ 117 కోట్ల వసూలు చేయగా.. '2.ఓ' కేవలం 5 రోజుల్లోనే 120 కోట్ల షేర్ ను రాబట్టి సరికొత్త రికార్డును నమోదు చేసింది. అయితే హిందీలో 'బాహుబలి 2' రికార్డుని టచ్ చేయలేదని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. హిందీ వెర్షన్ 'బాహుబలి 2' 511 కోట్ల షేర్ ను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న '2.ఓ' పరిస్థితి చూస్తుంటే 'బాహుబలి' రికార్డును అందుకోవడం అసాధ్యమేనని చెబుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలుపుకుని 5 రోజులకు గానూ '2.ఓ' 451 కోట్లు షేర్ ను రాబట్టింది.

Similar News