2.0 పరిస్థితి ప్రస్తుతం పర్లేదు..కానీ.

Update: 2018-12-04 02:37 GMT

గత వారం అంటే నవంబర్ 29 న వరల్డ్ వైడ్ గా రజిని 2.0 రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈసినిమా నిలబడగలిగింది. శని..ఆదివారాల్లో ఈసినిమా వండర్స్ క్రియేట్ చేసింది. కేవలం ఆదివారం ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసింది. నాలుగు రోజుల్లో ఈసినిమా 30 కోట్లు షేర్ ను వసూల్ చేసి స్టాండర్డ్ గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 72 కోట్లు కు కొన్నారు బయర్స్. అంటే ఇంకా సగం కూడా రాలేదు. తొలి వీకెండ్ బాగుంది కాబట్టి ఈ వీక్ కలెక్షన్స్ కూడా బాగుంటాయి అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. సోమవారం నుంచి గురువారం వరకు పీరియడ్‌ని 2.0 స్టడీగా దాటాలి. ప్రస్తుతం పోటీ ఇచ్చే సినిమాలు లేవు కాబట్టి వసూల్ పెరిగే అవకాశముంది. కానీ ఈ శుక్రవారం 'కవచం' సినిమా ఉంది. ఈసినిమా ప్రభావం ఉంటె ఉండొచ్చు. ఒకవేళ 'కవచం' కు నెగటివ్ టాక్ వస్తే...2.0 వసూల్ కి డోకా లేదు.

సో ఈజీగా ఈసినిమా మరో 20 కోట్లు దాకా వెళ్తుంది. అంటే ప్రస్తుతం 30 నెక్స్ట్ వీక్ ముగిసేసరికి 20 వస్తే టోటల్ 50 వస్తుంది. టైం బాగుండి ఇంకా ఎక్కువ వచ్చినా ఆశర్యపోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఈ మంత్ లో రిలీజ్ అయ్యే సినిమాలు మీద 2.0 భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈసినిమాకు కొంతవరకు వసూల్ తగ్గటానికి కారణం ఈసినిమాకు త్రీడీ థియేటర్లు ఎక్కువ ఇవ్వకపోవడం.

Similar News