ఈ వయసులో ఎక్కడా తగ్గని 80 స్ బ్యాచ్

1980 స్ బ్యాచ్ సందడి ఈసారి హైదరాబాద్ లోని చిరు కొత్తింట్లో జరిగిన సంగతి తెలిసిందే. చిరు ఇచ్చిన గ్రాండ్ పార్టీలో సీనియర్స్ బ్యాచ్ మొత్తం ఆడి [more]

Update: 2019-11-30 05:32 GMT

1980 స్ బ్యాచ్ సందడి ఈసారి హైదరాబాద్ లోని చిరు కొత్తింట్లో జరిగిన సంగతి తెలిసిందే. చిరు ఇచ్చిన గ్రాండ్ పార్టీలో సీనియర్స్ బ్యాచ్ మొత్తం ఆడి పాడి ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా వైరల్ అయ్యాయి. చిరు, నాగ్, వెంకీ, ఖుష్బూ, సుహాసిని, జయసుధ, జయప్రద, ప్రభు, సురేష్, నరేష్ లాంటి వాళ్లంతా ఈ పార్టీలో అల్లరల్లరి చేసిపడేసారు. అయితే ఈ పార్టీలో చిరు తో హీరోయిన్స్ అంతా కలిసి దిగిన ఓ పిక్ ఎంతగా వైరల్ అయ్యిందో.. తాజాగా బయటికొచ్చిన ఓ వీడియో కూడా క్షణాల్లో అంతే వైరల్ అయ్యింది. చిరు ఇంట్లో పార్టీ జరిగిన రోజు అక్కడ కొన్ని సాంగ్స్ కి చిరు తో పాటుగా సీనియర్ హీరోయిన్స్ వేసిన స్టెప్స్ చూస్తుంటే ఈ ఏజ్ లోనూ ఇరగదీసారుగా అనిపించకమానదు.

మెగాస్టార్ చిరు ఖైదీ నెంబర్ 150 తో సినిమాల్లోకి పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ….. డాన్స్ లతో అందరికి ఫుల్ మీల్స్ పెట్టాడు. ఇంతవయసులోను చిరు డాన్స్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక 80 స్ బ్యాచ్ తో చిరు బంగారు కోడిపెట్ట సాంగ్ కి వేసిన స్టెప్స్ వైరల్ అవ్వడమేగాక.. ఆ సాంగ్ లో చిరు తో కలిసి ఖుష్బూ, జయప్రద వేసిన డాన్స్ మాత్రం చూడడానికి భలేగా ఉంది. చిరు, కుష్బూ డాన్స్ చేస్తున్న టైం లో సుహాసిని జయప్రదని స్టేజ్ మీదకి తీసుకెళ్లి చిరు కి జత చెయ్యగా… జయప్రద కూడా చిరు తో కలిసి డాన్స్ అదరగొట్టేసింది. మరిఈ డాన్స్ చూసిన మెగా ఫాన్స్ మాత్రం మా మెగాస్టార్ లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని సంతోషపడిపోతున్నారు.

Tags:    

Similar News