1971 యుద్ధం ఆధారంగా ఒకేసారి ఇద్దరు తెలుగు హీరోల చిత్రాలు

Update: 2017-01-23 02:33 GMT

రుద్రమదేవి, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక సినిమాలు సాధించిన విజయాలు చరిత్ర లో నిలిచిపోయిన వాస్తవాలను ఇతివృత్తంగా చేసుకుని చెప్పే కథలకి తెలుగులో ఆదరణ పెరిగింది అనటానికి నిదర్శనం. చరిత్ర సాక్ష్యంగా తెలుసుకున్న వాస్తవాలు చుట్టూ నాటకీయత జోడిస్తూ సినిమా కథ తయారు చేయటమే తప్పితే వాస్తవాలకు కల్పితాలు జోడించి చారిత్రాత్మక కథలు చెప్పే వెసులుబాటు దర్శక రచయితలకు ఉండదు. అటువంటిది ఇప్పుడు చరిత్ర పుట్టలలో నిలిచినా ఒకే యుద్దాన్ని ఇద్దరు వేరు వేరు దర్శకులు వారి వారి కోణాలలో ప్రెసెంట్ చేస్తుండటం విశేషం. ఈ రెండు చిత్రాలలోనూ తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన కథానాయకులు కీలక పాత్రలు పోషించటం గమనార్హం.

ఫెబ్రవరి నెల 17 న హిందీ, తెలుగు భాషలలో విడుదల కానున్న 'ది ఘాజి ఎటాక్' చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించగా, రానా దగ్గుబాటి, తాప్సి పన్ను ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 1971 లో జరిగిన ఒక యుద్ధం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూర్తిగా సబ్ మెరైన్ లో రూపొందించారు. మరో వైపు మలయాళం మెగా స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న 1971 బియాండ్ బోర్డర్స్ చిత్రం కూడా 1971 లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతుంది. మేజర్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మళయాళ చిత్రంలో అల్లు శిరీష్ ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న 1971 బియాండ్ బోర్డర్స్ చిత్రం ఇదే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Similar News