రానాకీ నిర్మాతకి ఎందుకు చెడింది

దగ్గుబాటి రానా హీరో గా ‘1945’ అనే సినిమా ఎప్పుడో స్టార్ట్ అయిందని అందరికి తెలిసిందే. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఒక్క [more]

Update: 2019-10-28 07:19 GMT

దగ్గుబాటి రానా హీరో గా ‘1945’ అనే సినిమా ఎప్పుడో స్టార్ట్ అయిందని అందరికి తెలిసిందే. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా లేదు. అసలు సినిమా నడుస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. సడన్ గా నిన్న ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చింది. దీన్ని కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎస్.ఎం.రాజరాజన్ నిర్మిస్తున్నారు.

చీటింగ్ చేశారు….

రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ కింద రానా షాకింగ్ కామెంట్స్ పెట్టాడు. ఇది అసంపూర్తిగా మిగిలిపోయిన చిత్రం అని స్టార్ట్ చేసి నేను సంవత్సరంగా సినిమాకు సంబంధించిన వారిని ఎవరినీ కలవలేదు. ఇది ఇంకొంత మందిని చీటింగ్ చేసి డబ్బును సమకూర్చుకునే ప్రయత్నమే. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దు అంటూ కామెంట్ చేశాడు. అంతే కాదు ఈ సినిమా ఇంకా అదే నిర్మాత చేతిలో ఉంటే అందులో నటించే ఉద్ధేశ్యం తనకు లేదని క్లారిటీ ఇచ్చేసాడు. ప్రొడ్యూసర్, హీరో ల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో సక్రమంగా లేకపోవడంతో రానా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై ప్రొడ్యూసర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Tags:    

Similar News