150 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన భరత్ అనే నేను

Update: 2018-04-28 12:32 GMT

భారీ అంచనాలు మధ్య ఈ నెల 20న విడుదలైన 'భరత్ అనే నేను' సినిమా అదేవిధంగా కలెక్షన్స్ సునామిలా దూసుకుపోతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యూత్ తో పాటు.. మాస్ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించింది. దాంతో ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే 100 కోట్లు గ్రాస్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.

ఇక వారం రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 73.9 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందనేది తాజా సమాచారం. అటు ఓవర్సీస్ లోను రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. ముఖ్యంగా రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాపై ఉన్న యూఎస్ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేస్తూ వెళ్ళిపోతుంది.

అమెరికాలో ఈ సినిమా 3 మిలియన్ డాలర్లకి పైగా రాబట్టింది. అటు న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా లోను భారీ వసూళ్లను రాబడుతున్నట్టుగా చెబుతున్నారు. కొరటాల స్క్రీన్ ప్లే మ్యాజిక్.. మహేష్ నటన.. కైరా అద్వాని గ్లామర్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు వచ్చేలా చేయడంలో ప్రధానమైన పాత్రను పోషించాయని చెబుతున్నారు.

Similar News