10 నిమిషాల సినిమా ఫ్రీగా చూపిస్తున్నారు

Update: 2016-11-18 07:00 GMT

అప్పుడెప్పుడో ఆ మధ్యన అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే యూట్యూబ్ లో కొంత సినిమా వచ్చేసింది. అది చేసింది ఎవరో అని చెప్పనప్పటికీ ఆ లీకులు మాత్రం అత్తారింటికి చిత్ర యూనిట్ యే చేసిందని చాలామంది అన్నారు. సినిమా ప్రమోషన్ కోసమే అలా చేసిందని ప్రచారం జరిగింది. అసలు ఇంతకీ అలా యూట్యూబ్ లో సినిమా కొంచెం లీక్ అయినా కూడా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అయినా యే సినిమా అయినా కూడా ట్రైలర్స్ తో, టీజర్ తో లేక సాంగ్ బిట్స్ తో ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రం తాజాగా సినిమా ప్రమోషన్ లో క వెరైటి ప్రమోషన్ ని మొదలెట్టింది.

ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేసిన తమిళ మూవీ సైతాన్ తెలుగులో భేతాళుడుగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్ విషయం లో ఆ చిత్ర యూనిట్ కొంచెం వెరైటీ గా ఆలోచించి ఏకంగా 10 నిమిషాల సినిమా వీడియోని విడుదల చేసింది. ఇక ఈ 10 నిమిషాల వీడియో బిట్ ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. ఆ ఒక్క 10 నిమిషాలే సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. విజయ్ ఆంటోని హీరోగా చేస్తున్న సైతాన్ ఒక థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కింది. ఇంకా ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని విజయ్ ఆంటోనీ ఇరగ్గొట్టేసాడని ఆ 10 నిమిషాల వీడియో లో తెలిసిపోతుంది.. ఇక సైతాన్ మూవీ లో హీరో గా, మ్యూజిక్ డైరెక్టర్ గా విజయ్ ఆంటోనీ ఇరగదీశాడని సినిమా రిలీజ్ అవ్వకుండానే చెప్పేస్తున్నారు సినీ జనాలు. ఈ సినిమా డిసెంబర్ 2 న విడుదలై ఇంకెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూద్దాం.

Similar News