స్టార్ సింగర్ కు పక్షవాతం

కెనడియన్ సింగర్ తాను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు.

Update: 2022-06-11 07:15 GMT

ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్ ప‌క్ష‌వాతానికి గురయ్యాడు. ఈ విష‌యాన్ని అత‌డు స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. ముఖం ప‌క్ష‌వాతానికి గురికావ‌డంతో ఈ వారం అత‌డు నిర్వ‌హించాల్సిన ప‌లు షోల‌ను ర‌ద్దు చేశారు. తాను త్వ‌ర‌లోనే కోలుకుంటాన‌ని, అంత వ‌ర‌కు ఓపిక ప‌ట్టాల‌ని అభిమానులకు సూచించాడు. రామ్‌సే హంట్ సిండ్రోమ్‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని తెలిపాడు. అందువ‌ల్ల త‌న ముఖంలో ప‌క్ష‌వాతం వ‌చ్చిన‌ట్లు చెప్పాడు. ముఖంపై కుడివైపున ప‌క్ష‌వాతం వ‌చ్చింద‌ని, ఆ కార‌ణంగా క‌న్ను ఆడించ‌లేక‌పోతున్నాన‌ని, ఇక కుడి వైపున చిరున‌వ్వు కూడా క‌నిపించ‌ద‌ని, ఆ సైడ్ మొత్తం పెరాల‌సిస్ వ‌చ్చిన‌ట్లు తెలిపాడు. జ‌స్టిన్ బీబ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అత‌డి అభిమానులు కోరుకుంటున్నారు.

జస్టిన్ బీబర్ శుక్రవారం, జూన్ 10న ఒక వీడియోను పోస్టు చేసి తనకు ఉన్న పెరాలసిస్ గురించి వివరించాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని తన అభిమానులకు సందేశాన్ని అందించాడు. రామ్‌సే హంట్ సిండ్రోమ్ ముఖ నరాలపై దాడి చేస్తుంది. చికెన్ పాక్స్‌కు కారణమయ్యే వైరస్ వల్ల వస్తుంది. పాక్షిక పక్షవాతం కారణంగా తన ముఖం కుడి భాగాన్ని ఎలా కదలించలేకపోతున్నాడో తన అనుచరులకు చూపించాడు.
కెనడియన్ సింగర్ తాను కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు. తన ముఖాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఫేషియల్ ఎక్సర్‌సైజులు కూడా చేస్తున్నట్టు వెల్లడించాడు. త్వరలో సాధారణ స్థితికి వస్తుంది. ఇందుకు ఎంత సమయం పడుతుందో మాకు తెలియదు. నేను దేవుడిని నమ్ముతానని వెల్లడించాడు. ఈ సమయాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, తిరిగి ప్రదర్శనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తానని జస్టిన్ బీబర్ తెలిపాడు.


Tags:    

Similar News