Holi 2023 : హోలీ రోజున ఈ వస్తువులను ఇంట్లో ఉంచకండి

ప్పటి నుండో వాడుతున్న పాత చీపుర్లను హోలీ ముందురోజే మార్చేయాలి. వీలైతే పాత చీపురను గొయ్యితీసి పాతిపెట్టాలట.

Update: 2023-03-02 14:59 GMT

significance of holi

మనదేశంలో కుల, మత బేధాలు లేకుండా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ఈ పర్వదినం రోజున చిన్నా, పెద్ద అంతా కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. పండుగను జరుపుకుంటారు. రంగులు చల్లకుంటూ.. రంగులు కలిపిన నీటిని చల్లుకుంటూ.. డీజే మ్యూజిక్ కు స్టెప్పులేస్తూ.. ఉత్సాహంగా హోలీ ని జరుపుకుంటారు. అలాంటి హోలీ పండుగ రోజున కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం మంచిది కాదని కొందరు పురోహితులు చెబుతున్నారు.

హోలీ పండుగ రోజున పాత వస్తువులను.. హోలికా దహనం పేరుతో ఏర్పరిచే మంటల్లో వేసి దహనం చేస్తే దరిద్రం పోతుందని నమ్మిక. ఎప్పటి నుండో వాడుతున్న పాత చీపుర్లను హోలీ ముందురోజే మార్చేయాలి. వీలైతే పాత చీపురను గొయ్యితీసి పాతిపెట్టాలట. ఇలా చేయ‌డం వ‌ల‌న ల‌క్ష్మీదేవి సంతోషిస్తుంది. అదేవిధంగా ఇంట్లో వాడ‌కుండా ఉంచిన దుస్తుల‌ను ఎవ‌రికైనా దానం చేయ‌డం మంచిద‌ని పండితులు చెబుతున్నారు. ఇక‌, తెగిపోయిన పాత‌బ‌డిన చెప్పుల‌ను కూడా బ‌య‌ట‌ప‌డేయ్యాల‌ని పండితులు చెబుతున్నారు.
పాత వస్తువులు, చెక్కతో తయారు చేసి పాడైన వస్తువులను బోగీ మంటల్లో వేసి దహనం చేయాలి. ఇలా హోలీ ముందు రోజున పాతవస్తువులను తీసి.. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భావిస్తారు. అలాగే కొత్తగా ప్రారంభించే పనులు నిర్విఘ్నంగా సాగుతాయని పండితులు చెబుతున్నారు.


Tags:    

Similar News