అవి నిమ్మగడ్డ చౌకబారు ఎత్తుగడలే

చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలుబొమ్మగా మారిపోయారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిమ్మగడ్డ లో ఫ్యాక్షనిస్ట్ ధోరణి కనపిస్తుందన్నారు. రిటైర్డ్ అయిన అధికారి [more]

Update: 2021-01-27 12:08 GMT

చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలుబొమ్మగా మారిపోయారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిమ్మగడ్డ లో ఫ్యాక్షనిస్ట్ ధోరణి కనపిస్తుందన్నారు. రిటైర్డ్ అయిన అధికారి అయి ఉండి అధికారులపై ఇలా వ్యవహరించడం తగదన్నారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ నిమ్మగడ్డ చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాగాన్ని అస్థిరపర్చాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూస్తున్నారన్నారు. ఎన్నికల విధులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీనియర్ అధికారుల పట్ల నిమ్మగడ్డ వాడిన భాష అభ్యంతరకరమన్నారు. చంద్రబాబు చెప్పినట్లే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నడుచుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. ఉద్యోగుల్లో, అధికారుల్లో టెర్రర్ క్రియేట్ చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News