వారం రోజుల్లో 3,571 కేసులు.. ట్రాఫిక్ నిబంధనలను?

సైబరాబాద్ , రాచకొండ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించిన వారిపై ఉక్కుపాదం మోపోతున్నారు పోలీసులు. మూడు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వయించి డ్రంక్ అండ్ డ్రైవ్ , [more]

Update: 2021-01-05 02:11 GMT

సైబరాబాద్ , రాచకొండ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించిన వారిపై ఉక్కుపాదం మోపోతున్నారు పోలీసులు. మూడు రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వయించి డ్రంక్ అండ్ డ్రైవ్ , నెంబర్ ప్లేట్ టాంపరింగ్ , ఓవర్ స్పీడ్ , హారన్ చేంజ్ పై పోలీసులు నిఘా పెట్టి ఎక్కడికక్కడ వాహనాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు కఠినతరం చేస్తున్నారు ..మూడు రోజులుగా స్పెషల్ డ్రైవ్ పేరుతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు .. ఇందులో భాగంగా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వారంరోజుల్లో 3571 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

Tags:    

Similar News