విజృంభిస్తోన్న లోన్ యాప్ లు.. వేధింపులు భరించలేక పెరుగుతున్న ఆత్మహత్యలు

ఆ తర్వాత లోన్ కట్టకపోతే.. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మీరు లోన్ డబ్బులు కట్టకపోతే మీ కాంటాక్ట్స్ అన్నింటికీ మీ గురించి..

Update: 2022-05-30 08:41 GMT

బెంగళూరు : కొంతకాలం క్రితం కేంద్రం, పోలీసుల హెచ్చరికలతో సైలెంట్ అయిన లోన్ యాప్ నిర్వహణ సంస్థలు ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నాయి. విద్యార్థులు, యువతే టార్గెట్ గా అదేపనిగా మెసేజ్ లు పంపి, వారికి లోన్లు ఇచ్చి తమ ఉచ్చులోకి లాగుతున్నాయి. లోన్ ఇచ్చేటపుడు ఫోన్లో అన్నింటికీ పర్మిషన్ ఇస్తేనే లోన్ వస్తుంది. లోన్ కోసం మొబైల్ కాంటాక్ట్స్, ఫొటోలు అన్నింటికీ పర్మిషన్ ఓకే చేసేస్తున్నారు.

ఆ తర్వాత లోన్ కట్టకపోతే.. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మీరు లోన్ డబ్బులు కట్టకపోతే మీ కాంటాక్ట్స్ అన్నింటికీ మీ గురించి చెడుగా మెసేజ్ లు పంపుతామని, మీ కుటుంబ పరువు తీస్తామని బెదిరిస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులే టార్గెట్ గా లోన్ యాప్ సంస్థలు తమ దోపిడీకి తెరతీశాయి. చదువుకునే విద్యార్థులను టార్గెట్ చేసి వారికి లోన్లు ఇచ్చి అధిక వడ్డీలు గుంజుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు క్రెడిట్ కార్డులంటూ హ్యాండ్ లోన్ ఇచ్చి లోబరుచు కుంటున్నాయి. లోన్లు తీసుకొని కట్టలేని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి నీచంగా మాట్లాడుతున్నారు.
స్లైస్ యాప్ ఫైనాన్స్ సంస్థ లోన్లు ఇచ్చి.. తిరిగి కట్టకపోతే తల్లిదండ్రులను ఇష్టమొచ్చినట్లు తిడుతోంది. ఇవి భరించలేని కొందరు విద్యార్థులు, యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఆన్ లైన్ లోన్ యాప్ సంస్థల వేధింపులకు పెద్దసంఖ్యలో యువత బలవుతుంది. లోన్ తీసుకున్న విషయం ఇంట్లో చెప్పలేక, తిరిగి కట్టలేక, వారి టార్చర్ భరించలేక క్షణకాలంలో ప్రాణాలు తీసుకుని.. తల్లిదండ్రుల గర్భశోకానికి కారణమవుతున్నారు. కేంద్రం, పోలీసు వ్యవస్థ మరోమారు లోన్ యాప్ లపై దృష్టిసారిస్తే గానీ.. వాటి ఆగడాలు ఆగేలా లేవు.




Tags:    

Similar News