వైసీపీ పై జనసేన డిజిటల్ వార్

విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని నేటి నుంచి జనసేన పార్టీ మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించనుంది

Update: 2021-12-18 05:43 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేటి నుంచి జనసేన పార్టీ మూడు రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని పార్లమెంటులో పోరాడాలంటూ వైసీపీ, టీడీపీ పార్లమెంటు సభ్యులకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ట్యాగ్ చేయాలని సూచించారు. పార్లమెంటు సభ్యులకు వారి బాధ్యతలను గుర్తు చేయడంలో భాగంగా ఈ డిజిటల్ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను....
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఇటీవల పవన్ కల్యాణ్ ఒక రోజు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచేందుకు డిజిటల్ క్యాంపెయిన్ ను నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ఏపీ నుంచి విశేష స్పందన వస్తుందని పవన్ ఆశిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఇందులో కనపడుతుందని భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ట్వీట్ చేయాలని, ఇందుకోసం #raise_placards_andhra_mp హ్యాష్ ట్యాగ్ వాడాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


Tags:    

Similar News