మరో పథకాన్ని ప్రారంభించనున్న జగన్ ... ఎప్పుడంటే?

పేదలకు ఇళ్లపై పూర్తి హక్కులు కల్పించే వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు

Update: 2021-12-02 07:24 GMT

పేదలకు ఇళ్లపై పూర్తి హక్కులు కల్పించే వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. దీనికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అని నామకరణం చేశారు. అయితే ఈ పథకం వినియోగించుకోవడమా? లేదా? అన్నది లబ్దిదారులకే వదిలేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. ఖచ్చితంగా ఈ పథకం కింద నగదును చెల్లించి సంపూర్ణ హక్కులు పొందాలన్న కండిషన్ ఏమీ లేదని చెబుతుంది.

రిజిస్ట్రేషన్లు...
ఈ నెల 8వ తేదీ నుంచి వన్ టైమ్ సెటిల్ మెంట్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 2000 సంవత్సరం నుంచి 2014 వరకూ పక్కా గృహాలు పొందిన 39 లక్షల మంది లబ్దిదారులు దీనిని వినియోగించుకోవచ్చు. అయితే టీడీపీ మాత్రం తాము అధికారంలోకి వస్తే ఉచితంగా హక్కులు కల్పిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన జగన్ ప్రారంభించబోయే ఈ పథకం ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News