నేడు పింగళి వెంకయ్య జయంతి ఉత్సవం

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవ వేడుకలను నేడు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు

Update: 2022-08-02 02:53 GMT

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవ వేడుకలను నేడు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అన్ని జిల్లాల్లో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక, క్రీడలు, సాంస్కృతిశాఖ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవ్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కార్యాలయం నుంచి ఈరోజు త్రివర్ణ పతకాన్ని ఆవిష‌్కరించి ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

జగన్ చేతుల మీదుగా....
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా జగన్ ప్రారంభిస్తారు మిగిలిన జిల్లాల్లో మంత్రులు పాల్గొంటారు. పింగళి వెంకయ్య స్వస్థలమైన భట్ల పెనుమర్రు గ్రామంలో మంత్రి జోగి రమేష్ హాజరవుతారని రజిత్ భార్గవ్ తెలిపారు. పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్ ను మంత్రి జోగి రమేష్ ఆవిష్కరిస్తారు. పింగళి వెంకయ్య 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ పతాకాన్ని రూపొందించారు. అప్పుడు ఈ సమావేశానికి మహాత్మాగాంధీ అధ్యక్షత వహించారు.


Tags:    

Similar News