నేటి నుంచి ఏపీలో ఆ విక్రయాలు బ్యాన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాలపై నిషేధం విధించింది.

Update: 2021-12-07 01:29 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నికోటిన్ తో ఉన్న గుట్కా, పాన్, మసాలా, నమిలే పొగాకు ఉత్పత్తులు ఏవీ ఏపీలో అమ్మకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. వాటిని తయారు చేయడం, సరఫరా చేయడం, విక్రయించడం నేరంగా భావిస్తామని ప్రభుత్వం తెలిపింది.

నేటి నుంచి...
ఈ నెల 7వ తేదీ నుంచి ఏడాడి పాటు ఈ నిషేధం అమలులో ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్పత్తులను నిల్వ చేయడం కూడా నేరమని పేర్కొంది. గుట్కా ను నిషేధించాలని న్యాయస్థానాల్లో కూడా అనేక పిటీషన్లు దాఖలయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పొరుగున ఉన్న తెలంగాణలోనూ నిషేధం అమలవుతుంది.


Tags:    

Similar News