Mon Dec 15 2025 20:24:15 GMT+0000 (Coordinated Universal Time)
Team India : వరల్డ్ కప్ గెలిచిన రాత్రి టీం ఇండియా ఆటగాళ్లు ఏం చేశారో తెలుసా?
టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అయితే ఆరోజు రాత్రి ఆటగాళ్లంతా ఏం చేశారన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంటుంది.

వరల్డ్ కప్ గెలవడమనేది ఒక కల. మొన్న టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అయితే ఆరోజు రాత్రి ఆటగాళ్లంతా ఏం చేశారన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంటుంది. అయితే ఆరోజు రాత్రి టీం ఇండియా జట్టు సభ్యులు ఎవరూ నిద్రపోలేదట. రాత్రంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కప్ ను సాధించిన విజయాన్ని ఆస్వాదించారు.
హోటల్ రూమ్ కు చేరుకుని..
వరల్డ్ కప్ తో హోటల్ రూమ్ కు చేరుకున్న భారత జట్టు మొత్తం ఆ హోటల్ లో రాత్రంతా సంబరాలు చేసుకున్నారట. తెల్లవారు జాము వరకూ వరల్డ్ కప్ విజయాన్ని ఎంజాయ్ చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. జీవితంలో మధరమైన, అపురూపమై ఘట్టాన్ని నెమరువేసుకుంటూ, మ్యాచ్ లో జరిగిన వింతలు, విశేషాలు చెప్పుకుంటూ రాత్రంగా టైంపాస్ చేశారట.
Next Story

