Mon Mar 16 2026 19:27:14 GMT+0530 (India Standard Time)
T20 World Cup 2024 : నేడు భారత్ vs కెనడా మ్యాచ్ .. వర్షం పడకపోతేనే
టీ 20 వరల్డ్ కప్ లో భారత్ - కెనడా మధ్య మ్యాచ్ నేడు జరగనుంది

టీ 20 వరల్డ్ కప్ లో భారత్ - కెనడా మధ్య మ్యాచ్ నేడు జరగనుంది. ఫ్లోరిడాలో రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ సూపర్ 8కు చేరుకుంది. ఈ మ్యాచ్ కేవలం నామమాత్రమే. ఇప్పటికే భారత్ పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికాతో గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్ 8కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం ఏర్పరుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫ్లోరిడాలో నేడు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
చివరి మ్యాచ్ లో...
టీ 20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లలో ఇది ఎ గ్రూప్ లో చివరి మ్యాచ్. అయితే మ్యాచ్ జరిగితే భారత్ కొన్ని ప్రయోగాలను చేయాలని భావిస్తుంది. ఇప్పటి వరకూ అవకాశం లభించని వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తుంది. శివమ్ దూబే స్థానంలో యశస్వి జైశ్వాల్ ను కానీ, సంజూ శాంసన్ ను కానీ ఆడించే అవకాశముందని తెలిపింది. విరాట్ కోహ్లి ఓపెనర్ గా వరస వైఫల్యాలతో ఫస్ట్ డౌన్ వచ్చేలా ఈ మ్యాచ్ లో ప్రయోగం చేసే అవకాశముందని అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.
Next Story

