Tue Jan 20 2026 11:23:53 GMT+0000 (Coordinated Universal Time)
World cup 2023 : భారత్ విజయ లక్ష్యం 274
భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించాడు

భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీశారు. న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించాడు. దాదాపు మూడు వందలకు పైగానే పరుగులు సాధిస్తారనుకుంటే షమి బౌలింగ్‌తో దానిని కంట్రోల్ చేయగలిగారు. ఒక వైపు బుమ్రా, కులదీప్‌లు కూడా రాణించడంతో తక్కువ పరుగులకే అవుట్ చేయగలిగారు. భారత్ ముందు భారీ లక్ష్యం ఉందనుకున్నప్పటికీ షమీ కారణంగానే చాలా వరకూ న్యూజిలాండ్ స్కోరు ఆ వైపు వెళ్లకుండా కట్టడి చేయగలిగాడు.
కట్టడి చేయగలిగారు...
యాభై ఓవర్లకు న్యూజిలాండ్ కేవలం 273 పరుగులు మాత్రమే చేసింది. ఇది కూడా భారీ లక్ష్యమే అయినా మూడు వందల పరుగులు దాటనివ్వకుండా అడ్డుకట్ట వేయగలిగారు. ఒకవైపు మిచెల్ పరుగులు తీస్తుంటే మిగిలిన న్యూజిలాండ్ బ్యాటర్లను ఇంటికి పంపుతుండటంతో భారత్ పని సులువయింది. ప్రస్తుతం భారత్ యాభై ఓవర్లలో 274 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు నిలదొక్కుకుంటే ఇదేమీ పెద్ద టార్గెట్ కాదని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
Next Story

