Fri Dec 05 2025 21:37:28 GMT+0000 (Coordinated Universal Time)
World cup 2023 : బంగ్లాదేశ్ ఎదుట భారీ స్కోరు
వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది

వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. 45 ఓవర్లకు మూడు వందల తొమ్మిది పరుగులు చేసింది. నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఇంకా ఆరు ఓవర్లు ఉండటంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసే అవకాశాలున్నాయి. 350 పరుగులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఛేజింగ్ తో....
ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ ఈ వరల్డ్ కప్ లో ఎలాంటి విజయాలు నమోదు చేయలేదు. పాయింట్ల పట్టికలోనూ వెనకబడి ఉంది. సౌతాఫ్రికా నిర్దేశించిన భారీ స్కోరు చేయాలంటే బంగ్లాదేశ్ బ్యాటర్లు బాగా శ్రమించాల్సి ఉంది. మరసారి సంచనాలు జరిగితే తప్ప బంగ్లాదేశ్ కు విజయం దక్కదన్న అభిప్రాయం క్రీడా విశ్లేషకుల నుంచి వెలువడుతున్నాయి. డీకాక్ 174 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
Next Story

