Sun Nov 03 2024 15:45:02 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియా రెండు వికెట్లు కోల్పోయి
భారత్ నిలకడగా ఆడుతుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యంతో దిగిన టీం ఇండియా ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు
భారత్ నిలకడగానే ఆడుతుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. మరోసారి రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించాడు. రన్ రేటును పరుగులు పెట్టించాడు. అయితే బ్యాడ్ లక్ నలభై ఎనిమిది పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన విరాట్ కొహ్లీ కూడా కొంత నిలదొక్కుకున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం విరాట్ కొహ్లి, శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నారు.
గిల్ హాఫ్ సెంచరీ...
శుభమన్ గిల్ రీ ఎంట్రీ తర్వాత తొలి అర్థ సెంచరీ చేశాడు. 20 ఓవర్లలో ఇండియా 142 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కొహ్లి 28 పరుగుల వద్ద ఆడుతున్నాడు. రన్ రేట్ పెద్దగా లేకపోవడం, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కూడా స్ట్రాంగ్గానే ఉండటంతో భారత్ కు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే పంథాలో ఆడితే భారత్ కు నాలుగో విజయం ఖాయమని చెప్పాలి. రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడం కొంత బాధాకరమే. రెండు పరుగుల వద్ద అర్ధ సెంచరీని కెప్టెన్ మిస్ చేసుకున్నాడు. శుభమన్ గిల్ 53 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
Next Story