Fri Dec 05 2025 13:28:03 GMT+0000 (Coordinated Universal Time)
World Cup 2023 : ఈరోజు మ్యాచ్ జరిగేది డౌటే... కారణం ఇదే
ఈరోజు బంగ్లాదేశ్ - శ్రీలంక మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వరల్డ్ కప్ లో వరసగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. మ్యాచ్‌లన్నీ చివర దశకు చేరుకుంటున్నాయి. సెమీస్ ఫైనల్స్ కు ఏ టీం చేరుతుందన్న దానిపై రెండు మూడు రోజుల్లోనే స్పష్టత రానుంది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ మాత్రం జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈరోజు బంగ్లాదేశ్ - శ్రీలంక మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాయుకాలుష్యంతో...
ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యం నమోదవుతుంది. పాఠశాలలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వాయు కాలుష్యం పెరగడంతో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ప్రాక్టీస్ కు కూడా దూరంగా ఉన్నాయి. తాము ఉంటున్న ప్రదేశం నుంచి బయటకు కూడా రాలేదు. కాలుష్యానికి భయపడి ప్రాక్టీస్ ను కూడా మానుకోవడంతో ఈరోజు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానం అందరిలోనూ బయలుదేరింది.
సెమీస్ నుంచి....
వాస్తవానికి బంగ్లాదేశ్, శ్రీలంక రెండు జట్లు సెమీస్ నుంచి తప్పుకున్నాయి. అవి ఇక సెమీ ఫైనల్స్ కు వెళ్లే ఛాన్స్ లేకపోవడంతో ఈ ఇరుజట్లు ఆడటం అవసరమా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పైగా కాలుష్యం ఉండటంతో ఈ జట్లు ఆడుతున్న మ్యాచ్ ను రద్దు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. కాలుష్యంతో స్టేడియానికి ఎవరూ వచ్చే అవకాశం కూడా లేదు. అయితే ఈరోజు నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేయడంతో ఇరు జట్లు నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాయి. మ్యాచ్ ఆగిపోతే చెరి ఒక పాయింట్లు, లేదంటే వైద్యుల సూచనల మేరకు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు.
Next Story

