Mon Sep 09 2024 11:40:10 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుండే BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్.. దేనిలో చూడొచ్చంటే..?
లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్ వంటి షట్లర్లపై భారత్ ఆశలు పెట్టుకుంది.
ప్రతిష్టాత్మకమైన BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్ పోటీలు 2022 ఆగస్ట్ 21 నుండి జపాన్‌లోని టోక్యోలో ప్రారంభం కానున్నాయి. BWF టాప్-ఫ్లైట్ ఈవెంట్లో సైనా నెహ్వాల్, విక్టర్ ఆక్సెల్సెన్, కెంటో మొమోటా, తాయ్ ట్జు యింగ్ వంటి బ్యాడ్మింటన్ స్టార్లు పోటీపడనున్నారు. భారత షట్లర్ పివి సింధు ఈ ఈవెంట్లో ఆడడం లేదు. కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో బాధపడింది, దీంతో ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది.
ఇక లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్ వంటి షట్లర్లపై భారత్ ఆశలు పెట్టుకుంది. లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్ గత సంవత్సరం.. కాంస్య మరియు రజత పతకాలను గెలుచుకున్నారు. వెటరన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రెండో రౌండ్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరతో తలపడబోతోంది. ఈ మ్యాచ్ లో సైనా విజయం సాధిస్తే పతకం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉండనున్నాయి.
BWF ప్రపంచ ఛాంపియన్షిప్ 2022 ఎప్పుడు ప్రారంభమవుతుంది?
BWF ప్రపంచ ఛాంపియన్షిప్ 2022 ఆగస్టు 22న ఉదయం 7:30 IST గంటలకు ప్రారంభమవుతుంది.
BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్ 2022ని ఏ టీవీ ఛానెల్‌లు ప్రసారం చేస్తాయి?
BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్ 2022 భారతదేశంలోని స్పోర్ట్స్ 18 ఛానెల్లో ప్రసారం చేయనున్నారు.
BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2022 యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని నేను ఎలా చూడవచ్చు?
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు 2022 VOOT సెలెక్ట్ యాప్ మరియు వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
Next Story