Fri Sep 13 2024 14:50:11 GMT+0000 (Coordinated Universal Time)
లక్ష్య సేన్ అద్భుతం చేయబోతున్నాడా..?
కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన విజయం సాధించిన లక్ష్య సేన్‌తో సహా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు
కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన విజయం సాధించిన లక్ష్య సేన్‌తో సహా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆగస్టు 22 నుండి టోక్యోలో ప్రారంభమయ్యే BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్ 2022లో తమ పోరాటాన్ని మొదలుపెట్టబోతూ ఉన్నారు. మాజీ ప్రపంచ నంబర్ 1 సైనా నెహ్వాల్ కు కూడా ఈ టోర్నమెంట్ చాలా ముఖ్యం. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా ప్రస్తుతం 28వ ర్యాంక్‌లో ఉంది. మొదటి మ్యాచ్ లో జోంగ్కాంగ్కు చెందిన చియుంగ్ న్గాన్ యిని తో తలపడనుంది. రెండవ రౌండ్లో జపాన్‌కు చెందిన ప్రపంచ నంబర్ 6 నోజోమి ఒకుహరాతో తలపడే అవకాశాలు ఉన్నాయి.
మాళవికా బన్సోడ్ కూడా మహిళల సింగిల్స్ లో తన సత్తా చాటనుంది. డెన్మార్క్ కు చెందిన ప్రపంచ నం. 21 లైన్ క్రిస్టోఫర్సన్తో ఆమె తలపడనుంది. పురుషుల్లో భారత్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్ (13వ ర్యాంక్), లక్ష్య సేన్ (10వ స్థానం), హెచ్ఎస్ ప్రణయ్ (18వ ర్యాంక్) డ్రాలో భాగంగా ఒకే పూల్ లో ఉన్నారు. వారిలో ఒకరు మాత్రమే సెమీ-ఫైనల్లోకి ప్రవేశించగలరు. ఈ వారం బర్మింగ్‌హామ్‌లో పురుషుల సింగిల్స్ స్వర్ణం సాధించిన లక్ష్య సేన్ పై అందరి దృష్టి ఉంది. అతను టోక్యో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు మొదటి రౌండ్లో బైని పొందాడు.
స్పెయిన్‌లో జరిగిన గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్, లక్ష్య.. రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. మలేషియాకు చెందిన ప్రపంచ నంబర్ 5 లీ జి జియా, జపాన్‌కు చెందిన ప్రపంచ నంబర్ 2 కెంటో మొమోటాలను ఎదుర్కోవాల్సి ఉంది. B సాయి ప్రణీత్.. చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్ తో ఆరంభంలోనే తలపడనున్నాడు. బర్మింగ్‌హామ్ 2022 నుండి స్వర్ణ పతక విజేతలైన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్‌లో భారత జట్టుకు ముందుకు తీసుకుని వెళ్లనున్నారు. మను అత్రి/బి సుమీత్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ గరగ/ విష్ణువర్ధన్ గౌడ్ పంజాల, ఎంఆర్ అర్జున్/ధృవ్ కపిల కూడా పోటీల్లో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ/గాయత్రీ గోపీచంద్, అశ్విని పొన్నప్ప/ఎన్ సిక్కి రెడ్డి జోడీ భారత్‌పై ఆశలు పెట్టుకోగా.. పూజా దండు/ సంజనా సంతోష్, అశ్విని భట్ కె/ శిఖా గౌతమ్ కూడా తమ సత్తా చూపించబోతున్నారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఇషాన్ భట్నాగర్/తనీషా క్రాస్టో, వెంకట్ గౌరవ్ ప్రసాద్/జూహీ దేవాంగన్ అనే రెండు భారత జోడీలు బరిలోకి దిగనున్నాయి.
News Summary - BWF World Championships 2022 Live Streaming When and where to watch Lakshya Sen match
Next Story