Tue Sep 10 2024 11:35:57 GMT+0000 (Coordinated Universal Time)
BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో సత్తా చాటాలని భావిస్తున్న సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి
BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి
భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జట్టు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్లో బాగా ఆకట్టుకున్నారు. వీరిద్దరూ ఇటీవల ముగిసిన CWG 2022లో స్వర్ణం కూడా గెలుచుకున్నారు. భారత జంట ఇప్పుడు ఆగస్ట్ 22న టోక్యోలో ప్రారంభం కానున్న BWF ప్రపంచ ఛాంపియన్షిప్ పై దృష్టి సారించింది. ప్రపంచంలోనే గొప్ప బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అద్భుతంగా ఆడి.. గెలవాలని భావిస్తూ ఉన్నారు.
"మేము టోర్నమెంట్లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాము. ఫైనల్స్ లో చేరుకోవడం గురించి ఆలోచించట్లేదు. ఇది సంవత్సరంలో అతిపెద్ద టోర్నమెంట్.. ప్రస్తుతం మంచి ఆత్మ విశ్వాసంతో ఉన్నాం. మేము జపాన్‌లో బాగా రాణించాలనుకుంటున్నాము. మేము పోటీ కోసం మా 200 శాతం సిద్ధంగా ఉన్నాం, దీని తర్వాత మాకు మంచి విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంది" అని సాత్విక్‌సాయిరాజ్ చెప్పుకొచ్చాడు. టోర్నమెంట్ కు ముందు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. రాబోయే రోజుల్లో మరికొన్ని శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గత మూడు నెలలుగా వారి దృష్టి BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్ పైనే ఉంది. ఇతర BWF ఈవెంట్ల కోసం, CWG కోసం శిక్షణ తీసుకున్నారు. టోక్యోలో రాబోయే రెండు వారాలు వారు అతి పెద్ద పరీక్షను ఎదుర్కోనున్నారు.
టోక్యోలో జరిగిన పురుషుల డబుల్స్‌లో భారత జోడీకి ఉన్న భారీ పోటీ గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ ఈ ఈవెంట్లో పోటీపడతారు. చిన్న పొరపాటు కూడా ప్రపంచ టైటిల్‌ను గెలుచుకోవాలనే వారి కలను ముగించవచ్చు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల కోసం ఇప్పటికే డ్రాలు నిర్వహించారు. భారత జోడీకి బై లభించింది, అయితే మలేషియాకు చెందిన గోహ్ వి షెమ్ మరియు టాన్ వీ కియోంగ్ రూపంలో బలమైన మలేషియా టీమ్ తో తలపడే అవకాశం ఉంది. "మేము BWF ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో గతంలో ఆదాము. అగ్రశ్రేణి పోటీదారులందరితో ఆడాము కాబట్టి ఛాంపియన్‌షిప్‌లో పోటీ గురించి మాకు తెలుసు. డ్రా ముగిసింది. మేము ప్రీ క్వార్టర్స్‌లో మలేషియా జోడీతో తలపడవచ్చు. ఈ పోటీలో కూడా గెలవాలనే శక్తి మాలో ఉందని నాకు తెలుసు. ప్రస్తుతానికి మేము ఆడుతున్న తీరు ప్రకారం వారిని ఓడించడానికి మాకు మంచి అవకాశం ఉంది, "అని సాత్విక్ అన్నాడు.
Next Story