Thu Dec 18 2025 13:44:26 GMT+0000 (Coordinated Universal Time)
Women's Day : మార్చి 5న నర్సంపేటలో మహిళా క్రీడోత్సవాలు..విజేతలకు ప్రైజ్ మనీ
కబడ్డీ, ఖోఖో, తాడు లాగుట పోటీల్లో మండల స్థాయి విజేతలకు రూ.10 వేల ప్రైజ్‌మనీ, షీల్డులు అందించనున్నారు.

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నర్సంపేటలో మహిళా క్రీడోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రీడోత్సవాలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్నాయి. నియోజకవర్గస్థాయిలో మహిళలకు క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. మార్చి 5న నర్సంపేటలో డివిజన్ స్థాయి క్రీడలను నిర్వహించనున్నారు. కబడ్డీ, ఖోఖో, తాడు లాగుట, రన్నింగ్, రంగోలి పోటీలు జరగనున్నాయి.
కబడ్డీ, ఖోఖో, తాడు లాగుట పోటీల్లో మండల స్థాయి విజేతలకు రూ.10 వేల ప్రైజ్‌మనీ, షీల్డులు అందించనున్నారు. రన్నింగ్, రంగోలి పోటీల విజేతలకు రూ. 5 వేలు, రన్నరప్‌లకు రూ. 3 వేల ప్రైజ్‌మనీ, షీల్డులు ఇవ్వనున్నారు. కబడ్డీ, ఖోఖో, తాడులాగుటలో డివిజన్ స్థాయి విజేతలకు ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ. 5 వేలు, షీల్డులు అందిస్తారు. అంతేకాకుండా ఈ క్రీడోత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు పార్టిసిపేషన్ ప్రైజ్ ఇవ్వనున్నారు.
Next Story

