Sat Jan 24 2026 08:58:15 GMT+0000 (Coordinated Universal Time)
Medaram : మేడారానికి మూడు కోట్ల మంది భక్తులు
ఈరోజు మేడారానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు బయలుదేరి వెళ్లారు

ఈరోజు మేడారానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు బయలుదేరి వెళ్లారు. మేడారం ప్రత్యేక బస్సులను మంత్రులు ప్రారంభించనున్నారు. మేడారం జాతర ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచే మేడారానికి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. వరసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో భక్తుల సంఖ్య ఈ మూడు రోజులు మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి...
మే 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారని భావించి మేడారంలో తాత్కాలిక బస్టాండ్‌ను ప్రభుత్వం నిర్మించింది. మేడారం జాతర సందర్భంగా ఈనెల 28 నుంచి 31 వరకు జనసాధారణ్ రైళ్లు కూడా నడవనున్నాయి.
Next Story

