Mon Dec 15 2025 08:24:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : 9999 ఫ్యాన్సీ నెంబరు ఎంత ధర పలికిందో తెలుసా?
వాహనాలకు క్రేజీ నెంబర్ల కోసం ఎంత డబ్బు వినియోగించడానికి చాలా మంది సిద్ధమవుతుంటారు.

వాహనాలకు క్రేజీ నెంబర్ల కోసం ఎంత డబ్బు వినియోగించడానికి చాలా మంది సిద్ధమవుతుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమకు అచ్చొచ్చిన నెంబరు కోసం తాము కొన్న వాహనం అంతైనా నెంబరు కోసం ఖర్చు చేయడానికి వెనుకాడరు.అందులో 9999 నెంబరు క్రేజీ నెంబర్. ఈ తరహా నెంబర్లను రవాణా శాఖ వేలం వేస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.
నలుగురు పోటీ పడటంతో...
వరంగల్ లోని ఆర్టీఏ కార్యాలయంలో 9999 నెంబరుకు అత్యధిక ధర పలికింది. ఈ నెంబరు కోసం నలుగురు పోటీ పడ్డారు. రవాణా శాఖ మాత్రం కనిష్ట ధర యాభై వేల రూపాయలుగా నిర్ణయించింది. అయితే ఈ నెంబరు కోసం నలుగురు పోటీ పడగా సీక్రెట్ ఆక్షన్ నిర్వహించారు. ఇందులో హర్ష కంపెనీ టీజీ 24 ఏ 9999 నెంబరును సొంతం చేసుకుంది. ఈ నెంబరు కోసం ఆ సంస్థ 11,09,999 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
Next Story

