Sat Jan 17 2026 05:39:12 GMT+0000 (Coordinated Universal Time)
మేడారం వెళ్లలేని భక్తులకు గుడ్ న్యూస్
మేడారం భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందిస్తుంది.

మేడారం భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందిస్తుంది. మేడారం సమ్మక్క-సారలమ్మ భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగనున్న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా, వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తుల ఇంటి వద్దకే బంగారం ప్రసాదాన్ని చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇంటి వద్దకే ప్రసాదం...
దేవాదాయ శాఖ సహకారంతో, బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయనున్నారు. ఇందుకోసం భక్తులు 299 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. www.tgsrtclogistics.co.in లో లేదా టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చు.
Next Story

