Wed Mar 18 2026 19:34:33 GMT+0530 (India Standard Time)
Medaram : మేడారం దారులన్నీ ఫుల్లు
మేడారం జాతరకు భక్తుల పెద్దయెత్తున తరలి వస్తున్నారు.

మేడారం జాతరకు భక్తుల పెద్దయెత్తున తరలి వస్తున్నారు. గత కొద్ది రోజులుగా మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 28వ తేదీ నుంచి మేడారం జాతర ప్రాంరభం కానుండటంతో ముందు నుంచే భక్తులు మేడారానికి తరలి వచ్చి గద్దెలను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇప్పటికే మేడారం జాతర సందర్భంగా ప్రారంభమయిన పనులు పూర్తయ్యాయి.
పెద్ద సంఖ్యలో భక్తులు...
ఈ ఏడాది మూడు కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే మేడారం జాతరకు ప్రత్యేక సర్వీసులను ప్రారంభించింది. బస్సులు, సొంత వాహనాలతో మేడారం వెళ్లే దారులన్నీ రద్దీగా మారాయి. నేటి నుంచి మేడారానికి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
Next Story

