Mon Jan 05 2026 04:30:24 GMT+0000 (Coordinated Universal Time)
మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారానికి భక్తులు పోటెత్తారు.

మేడారానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో మేడారాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా గద్దెను దర్శించుకోవాలన్న ఆకాంక్షతో బయలుదేరి వస్తున్నారు. మేడారం ప్రాంతానికి ఒక్కసారిగా భక్తులు తరలి రావడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
ఆదివారం కావడంతో...
అయితే మేడారం జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులకు వందల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. నేడు మేడారంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మంత్రి సీతక్క బయలుదేరి వెళ్లనున్నారు. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు.
Next Story

